మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 12 వ చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ యూరప్ లో జరుగనుంది. జులై ఫస్ట్ వీక్ నుండి జరిగే ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల ఫై రెండు పాటలను చిత్రీకరించనున్నారు.
ఇటీవల హైద్రాబాద్లో జరిగిన షెడ్యూల్ లో ఈచిత్రానికి సంభందించిన భారీ యాక్షన్ సన్నివేశాలకు తెరకెక్కించారు. ఈ చిత్ర షూటింగ్ ను నవంబర్ లో పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .
డివివి ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . ఇక మొదటి సారి చరణ్ బోయపాటి కలయికలో రానున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి .


