బాలకృష్ణ -బోయపాటిల చిత్రాన్ని నిర్మించేది ఎవరంటే ?

బాలకృష్ణ -బోయపాటిల చిత్రాన్ని నిర్మించేది ఎవరంటే ?

Published on Jul 1, 2018 2:34 PM IST

Boyapati Srinu balakrishna

నందమూరి నట సింహం బాలకృష్ణ , మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో మరో చిత్రం తెరకెక్కునుందని తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని సమాచారం. ఇంతవరకు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. తాజా గా ఇప్పుడు ఈచిత్రాన్ని కూడా ఈ సంస్థే నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. మాములు గానే బాలయ్య, బోయపాటిల కాంబినేషన్ అంటేనే అంచనాలు ఏ రేంజ్ లో వుంటాయో చెప్పనక్కరలేదు.

దానికి తోడు ఈ చిత్రానికి మైత్రి సంస్థ కూడా తోడైతే ఈ అంచనాలు మరింతగా పెరగడం ఖాయం. మరి ఇప్పటివరకు అయితే ఈ చిత్ర నిర్మాణం విషయం లో అధికారిక ప్రకటన వెలుబడలేదు .

ఇక బాలకృష్ణ ప్రస్తుతం ‘ఎన్టీఆర్ బయోపిక్’ లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. బోయపాటి, రామ్ చరణ్ 12వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో వున్నారు ఈ రెండు చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీళ్లిద్దరి కలియికలో సినిమా ప్రారభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు