బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సన్నీ లియోన్. అడల్ట్ స్టార్ గా సన్నీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా ‘కరెంజిత్ కౌర్ ; ది అన్ టోల్డ్ స్టోరీ అఫ్ సన్నీ లియోనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్ లో ప్రధానంగా సన్నీ లియోన్ మోడలింగ్, ఫోటో షూట్లు, సన్నీ చేస్తున్న పనులు నచ్చని ఆమె తల్లిదండ్రులను, సన్నీ ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఒడిదుడుకులను ప్రస్తావించారు. ఆదిత్య దత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సిరీస్ జూలై 16న ఓ ఇంగ్లీష్ ఛానెల్ లో ప్రసారం కానుంది.


