ప్రముఖ దర్శకుడి కథను ప్రముఖ యాంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు !

ప్రముఖ దర్శకుడి కథను ప్రముఖ యాంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు !

Published on Jul 8, 2018 5:50 PM IST

Bandu babu

దర్శకుడు మారుతీ తన సినిమాలకి కథ మాటలు రాసుకోవడంతో పాటు అప్పుడప్పుడు పక్కవారి కోసం కూడా కథలు రాస్తుంటాడాయన. ప్రస్తుతం ఓ యూత్ ఎంటర్టైమెంట్ అండ్ లవ్ తో కూడుకున్న ఓ కథ రాశాడు మారుతి. యాంకర్ ప్రభాకర్ దర్శకత్వంలో ఈ కథనే ‘బ్రాండ్ బాబు’ అనే పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐతే తాజాగా ఈ చిత్రానికి సంబధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

కాగా ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ శైలేంద్ర సరసన ఈషా రెబ్బా కథానాయకిగా నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి జే.బీ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ నటుడు మురళీశర్మ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ పళని కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా యస్ శైలేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు