స్టార్ హీరో కుమారుడుకి జోడిగా రాజశేఖర్‌ కుమార్తె ?

స్టార్ హీరో కుమారుడుకి జోడిగా రాజశేఖర్‌ కుమార్తె ?

Published on Jul 8, 2018 11:00 PM IST

sivaniraja

రాజశేఖర్, జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌ ‘2 స్టేట్స్‌’చిత్రంతో హీరోయిన్ గా పరిచయమవబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా పక్క భాషలైన తమిళ, మలయాళ చిత్రపరిశ్రమల్లోనూ నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే తమిళంలో విష్ణువిశాల్‌ హీరోగా రూపొందుతున్న చిత్రంలో శివాని హీరోయిన్ గా ఎంపికయ్యారు.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ కు జోడిగా శివాని రాజశేఖర్‌ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు భాషల్లోనూ నటించడానికి శివాని రెడీ అవ్వడం నిజంగా విశేషమే. మరి శివాని రాజశేఖర్‌ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

తాజా వార్తలు