మరో బయోపిక్‌ మొదలుకానుంది !

మరో బయోపిక్‌ మొదలుకానుంది !

Published on Jul 9, 2018 6:00 PM IST

Mithali Raj

టీమిండియా మహిళా కెప్టెన్‌ మన తెలుగమ్మాయి అయిన మిథాలీ రాజ్‌ బయోపిక్‌ తెరకెక్కబోతుంది, ఆమె స్వయంగా ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలిపారు. వయాకామ్‌ 18 సంస్థ ఈ బయోపిక్‌ ను రూపొందించబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని మిథాలీ రాజ్‌ చెప్పారు.

కాగా తన పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందని మిథాలీ అన్నారు. తమ వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయని అందుకే ప్రియాంక చోప్రా నా పాత్ర చేయాలనీ కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పై వెళ్లనుంది.

తాజా వార్తలు