కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మస్త్ర అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో అమితాబ్, రణ్బీర్ కపూర్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. కాగా ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే నాగార్జున ఇప్పటికే జక్మ్, ఖుదా గవా లాంటి కొన్ని హిందీ సినిమాల్లో నటించారు.
దర్శకుడు అయాన్ ముఖర్జీ, నాగార్జునకు బ్రహ్మస్త్ర కథ చెప్పి ఓ పాత్ర చేయమని అడిగారట, నాగార్జున వెంటనే అంగీకరించారని, త్వరలో ముంబైలో జరిగే షెడ్యూల్ లో నాగార్జున పాల్గొంటారని ఓ జాతీయ పత్రిక పేర్కొంది.


