
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో యువ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రకాష్ రాజ్, ఆమనీ , ప్రణీత లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు .
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి.

