
‘అర్జున్ రెడ్డి’ చిత్రం తో యువతను మెప్పించి తనకంటూ ప్రతేక్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా నటిస్తున్నాడు. ‘ఇరుముగన్’ ఫెమ్ ఆనంద్ శంకర్ తమిళ భాషలో తెరకెక్కిస్తున్న ‘నోటా’అనే చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అయన ముఖ్య మంత్రి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది .
ప్రస్తుతం ఈ సినిమా కి సంభందించిన చిత్రీకరణ ను పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకం ఫై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది.

