‘విన్నర్’ కాంభినేషన్ రిపీట్ కానుంది !

‘విన్నర్’ కాంభినేషన్ రిపీట్ కానుంది !

Published on Jul 13, 2018 6:01 AM IST

saidarmtej gopichand malin

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా’బలుపు’ ఫెమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘విన్నర్’. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ చిత్రం తరువాత మళ్ళి వీరిద్దరు కలిసి మరో చిత్రం చేయనున్నారని తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ గోపిచంద్ ఈ వార్తలపై స్పంధించారు.

తేజుతో చేయబోయే సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుందని , సినిమాకు సంభందించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అలాగే సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని అవ్వన్నీ కేవలం రూమర్లు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. యాక్షన్స్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో మంచి పట్టున్న గోపి, తేజు తో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తాడో చూడాలి.

తాజా వార్తలు