‘పడిపడి లేచె మనుసు’ విడుదల ఎప్పుడంటే !

‘పడిపడి లేచె మనుసు’ విడుదల ఎప్పుడంటే !

Published on Jul 13, 2018 7:00 PM IST

padi padi lechemanusu

యువ హీరో శర్వానంద్, సాయి పల్లవి జంటగా’కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ ఫెమ్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పడిపడి లేచె మనుసు’. ఈ చిత్రం ప్రస్తుతం కలకత్తా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ తో 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తరువాతి షెడ్యూల్ కోసం నేపాల్ వెళ్లనుందని సమాచారం. దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకం ఫై చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.

తాజా వార్తలు