‘ఆర్ సి12’ ఫస్ట్ లుక్ , టైటిల్ ఆ రోజే రిలీజ్ కానుంది ?

‘ఆర్ సి12’ ఫస్ట్ లుక్ , టైటిల్ ఆ రోజే రిలీజ్ కానుంది ?

Published on Jul 19, 2018 5:51 PM IST


‘రంగస్థలం’ చిత్రం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 12వ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ చిత్రాలను తెరకెక్కిచడంలో దిట్ట అయిన బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈచిత్రం యొక్క టైటిల్, మరియు ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా ఆగష్టు 22న విడుదల చేయనున్నారని చిత్ర వర్గాల నుండి సమాచారం అందుతుంది. అయితే ఈవార్తలపై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది.

ఈ చిత్రంలో చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ఫెమ్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ కల్లా పూర్తికానుంది. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తరువాత చరణ్ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు