‘తిక్క , విన్నర్ , నక్షత్రం , ఇంటెలిజెంట్ , జవాన్ , తేజ్ ఐ లవ్ యు’ చిత్రాల రూపంలో 6 వరుస పరాజయాలు పలకరించడం తో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన లుక్ మార్చే పనిలో పడ్డాడు. ఆయన కొత్త హెయిర్ స్టైల్ తో సన్నగా మారి కనిపించడం కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. ఇందుకోసం ఏకంగా 3 నెలలు సమయం తీసుకోనున్నాడట. ఈ విషయాన్ని తన కొత్త సినిమా నిర్మాతలకు కూడా తెలియాజేశాడట.
తేజు ,’నేను శైలజ’ ఫెమ్ కిశోర్ తిరుమల తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రం ఈ ఆగష్టు లో ప్రారంభం కావాల్సి ఉండగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది . ఇక ఈ చిత్రం తో పాటు గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు తేజు. ఈచిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.


