బాక్సాఫిస్ దగ్గర ఇంట్రెస్టింగ్ పోరు.. బైకర్ vs రాకాస వార్ లో నెగ్గేది ఎవరో..?

బాక్సాఫిస్ దగ్గర ఇంట్రెస్టింగ్ పోరు.. బైకర్ vs రాకాస వార్ లో నెగ్గేది ఎవరో..?

Published on Apr 3, 2026 7:00 AM IST

BIker and Rakassa

టాలీవుడ్ బాక్సాఫిస్ దగ్గర నేడు (ఏప్రిల్ 3, 2026) రెండు వైవిధ్యమైన చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకటి ఫాంటసీ కామెడీ ‘రాకాస’ కాగా, మరొకటి హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొంతకాలంగా నెలకొన్న స్తబ్దతను తొలగించి, ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల బాట పట్టించేందుకు ఈ రెండు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

​నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ చిత్రంపై యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ మూవీ సూర్యగ్రహణం నేపథ్యంతో సాగే వినూత్నమైన ఫాంటసీ ఎంటర్టైనర్. మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసింది.

​మరోవైపు, శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ తెలుగులో మొదటి ‘మోటోక్రాస్’ నేపథ్య చిత్రంగా రికార్డు సృష్టించింది. అత్యంత సాహసోపేతమైన బైక్ రేసింగ్ సీక్వెన్స్‌లతో రూపొందిన ఈ సినిమా మాస్ మరియు యాక్షన్ ప్రియులను టార్గెట్ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో, అధునాతన సాంకేతిక విలువల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఈ వీకెండ్ ఈ రెండు భిన్నమైన కథాంశాల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

తాజా వార్తలు