డ్రగ్స్ ఎక్కువై హాస్పిటల్ పాలయిన ప్రముఖ సింగర్ !

డ్రగ్స్ ఎక్కువై హాస్పిటల్ పాలయిన ప్రముఖ సింగర్ !

Published on Jul 25, 2018 11:44 AM IST

ddlovato

ddlovato1
అమెరికాలోని ప్రముఖ పాప్‌ సింగర్ డెమి లొవాటో డ్రగ్స్ మోతాదుకు మించి ఎక్కువ తీసుకున్నారు. దాంతో ఆమె మంగళవారం రాత్రి స్పృహతప్పి పడిపోయారు. అది గమనించిన కుంటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. కాగా ప్రస్తుతం డెమి లొవాటో ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఐతే భారతీయ నటి ప్రియాంక చోప్రాకు డెమీ లొవాటో మంచి స్నేహితురాలట. ‘డెమీ లొవాటో విషయం తెలిసిన వెంటనే ప్రియాంక చోప్రా ట్వీట్ చేస్తూ.. డెమీ విషయం తెలియగానే అందరూ షాక్ అయినట్లు నేనూ అయ్యాను .అందరికి లాగే నాకు డెమి లొవాటో అంటే చాలా ఇష్టం. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం అని ప్రియాంక ట్వీట్‌ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు