ట్వంటీ ట్వంటీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కు వాఖ్యాతగా వ్యవహరించి తన వాక్చాతుర్యం తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు సమీర్ కొచ్చర్. చూడడానికి అచ్చం హీరోలాగా ఉండే అతను ఇప్పుడు సినిమాల్లో నటించడానికి సిద్దమవుతున్నాడు. ఆయన అమలాపాల్ నటిస్తున్న’ అదో అంధ పరవాయి పోలా’ అనే చిత్రం తో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల ప్రముఖ నటి కాజల్ విడుదలచేశారు. సెంచరీ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వినోత్ తెరకెక్కిస్తున్నారు.


