విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’. ఇక ఈ రోజు జే ఆర్ సి కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా రానున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గీత ఆర్ట్స్ బ్యానేర్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు బన్నీ కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండడం తో ట్రేడ్ వర్గాల్లో ఈచిత్రం ఫై మంచి అంచనాలు ఏర్పడడం ఖాయం. దాంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరుగుతుండంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకులముందుకు రానుంది.


