యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం ‘సాక్ష్యం’. మంచి అంచనాల మధ్య జూలై 27న విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం బి సి సెంటర్ల లో అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ప్రధానంగా ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్న ఈ చిత్రం రెండు రోజులకుగాను కృష్ణా జిల్లాలో రూ.31,37, 423లక్షల షేర్ ను ఖాతాలో వేసుకుంది.
ప్రకృతి నేపధ్య కథతో సాగే ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు జగపతి బాబు, శరత్ కుమార్, మీనా మొదలగు వారు నటించారు. భారీ బడ్జెట్ తో అభిషేక్ పిక్చర్స్ పతాకం ఫై అభిషేక్ నామ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిచారు.


