‘కాళిదాస్’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచియమయ్యాడు యువ హీరో సుశాంత్. ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతున్న చెప్పుకోదగ్గ హిట్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు అయన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘చి ల సౌ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంధర్బంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుశాంత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తను ఎలాగైనా హిట్టుకొట్టాలని కష్ట పడుతున్న సమయంలో తన తండ్రి చనిపోవడం త్రీవ ఆవేదనను మిగిల్చిందని మా నాన్న అనుక్షణం నా భవిషత్తు గురించే ఆలోచించే వారని ఆయన చనిపోయే ముందు ఈ ‘చి ల సౌ’ చిత్ర కథను ఆయనకు చెప్పానని అది విని ఆయన ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్టు కొడతావని అన్నారని చెబుతూ సుశాంత్ కన్నీటి పర్యంతమయ్యారు.
మరి ఈ చిత్రమైన సుశాంత్ కు విజయాన్ని అందిచాలని కోరుకుంద్దాం.


