స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న151 వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి . ఇటీవల ఈ చిత్రానికి సంభందించిన 35 రోజుల భారీ షెడ్యూల్ పూర్తయింది. తరువాతి షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటుస్తున్నారని తెలిసిందే. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ చిత్రంలో తన పాత్ర ఎలావుండనుందో వివరించాడు విజయ్ . ఈ చిత్రంలో తమిళ భాషలో మాట్లాడే పాత్రలో నటిస్తున్నాడట. ఆయన పాత్రకు సంభందించిన చిత్రీకరణ ను త్వరలోనే మొదలుపెట్టానున్నారట .
బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ ను చిరు పుట్టిన రోజు సంధర్బంగా ఆగష్టు 22న విడుదల చేసే అవకాశాలున్నాయి. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.


