అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టిన ‘మిషన్ ఇంపాసిబుల్ ఫాలౌట్’ !

అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టిన ‘మిషన్ ఇంపాసిబుల్ ఫాలౌట్’ !

Published on Jul 31, 2018 3:33 PM IST

Mission Impossible Fallout
మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో ఆరో సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్ ఫాలౌట్’. ఈనెల 27 న ఇండియాలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఈ చిత్రం శుక్రవారం రూ .13. 50కోట్లు రూపాయలను అలాగే శనివారం రూ.16. 65కోట్ల రూపాయలను ఇక ఆదివారం అత్యధికంగారూ. 25.95కోట్ల రూపాయలను రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక ఈచిత్రం 3రోజులకుగాను మొత్తం 56.90 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈచిత్రం ఇప్పటివరకు ఇక్కడ అత్యధిక ఓపెనింగ్స్ ను సాధించిన ఆరో హాలీవుడ్ చిత్రం గా రికార్డు నెలకొల్పింది.

ఇక సూపర్ స్టార్ టామ్ క్రూజ్ ఇప్పటివరకు మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ కు సీక్వెల్ గా తెరకెక్కిన అన్ని చిత్రాల్లో ఆయనే హీరో గా నటించడం విశేషం. క్రిస్టోఫర్ మేక్ క్వారీ తెరకెక్కించిన ఈ ‘మిషన్ ఇంపాసిబుల్ ఫాలౌట్’ చిత్రాన్ని పారామౌంట్‌ పిక్చర్స్‌ పతాకంపై టామ్‌ క్రేజ్‌, జేజే అబ్రామ్స్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌ నిర్మించారు. ఈ చిత్రంలో వింగ్‌ రేమ్స్‌, సిమన్‌ పెగ్‌, హెన్రీ కవిల్‌, రెబాక ఫెర్గ్యూసన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

తాజా వార్తలు