అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక టీజర్ చూస్తుంటే చైతు కొత్త లుక్ లో చాలా స్టైలిష్ గా కనపడుతున్నాడు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఇగో ఉన్న అమ్మాయి పాత్రలో చూడడానికి బాగుంది. ఇక ఈ చిత్రంతో మారుతీ తన స్టయిల్లో కామెడీ తోపాటు ఒక చిన్న మెసేజ్ ను ఇవ్వనున్నాడని తెలుస్తుంది.
ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ చిత్రం ఫై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ శైలజా రెడ్డి పాత్రలో చైతు కు అత్త గా నటించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 31న విడుదలకానుంది.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


