‘పడిపడి లేచె మనసు’లో శర్వా , సాయి పల్లవిల పాత్రలు ఏంటో తెలుసా !

‘పడిపడి లేచె మనసు’లో శర్వా , సాయి పల్లవిల పాత్రలు ఏంటో తెలుసా !

Published on Aug 2, 2018 2:08 AM IST

padi3

శర్వానంద్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ ఫెమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. ఈ చిత్రం ప్రస్తుతం కలకత్తా లో 70 రోజుల పాటు జరిగిన భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. క ఈ షెడ్యూల్ తరువాత కొంత విరామం తీసుకొని చిత్ర యూనిట్ నేపాల్ వెళ్లనుందని ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తికానుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ పాత్రలో కనిపించనుంది. ఇక ఈచిత్రం మంచి ట్విస్ట్ లతో ఆసక్తికరంగా ఉండనుందట. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నా ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మివెంకటేశ్వర సినిమాస్ పతాకం ఫై చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తాజా వార్తలు