‘భరత్ అనే నేను’ విజయం తరువాత కొరటాల శివ మెగాస్టర్ చిరంజీవి తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్ తో తెరకెక్కనున్న ఈచిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఈచిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క, కాజల్ వంటి సీనియర్ హీరోయిన్ల పేర్లను చిరు సూచించిన కొరటాల మాత్రం ఆ పాత్రకు కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావిస్తున్నారట. దాంట్లో భాగంగా ప్రస్తుతం ఈ దర్శకుడు హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారట.
ఇక చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్ర షూటింగ్ ప్రస్తుతంశరవేగంగా జరుగుతుంది. ఈచిత్రాన్ని త్వరగా పూర్తి చేసి కొరటాల సినిమాను ప్రారభించాలని చూస్తున్నాడట మెగాస్టార్.


