సల్మాన్ ఖాన్ఎ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి చిత్రం ‘దబాంగ్’ బాలీవుడ్ లో రికార్డు లు క్రియేట్ చేసింది. ఇక తరువాత వచ్చిన రెండవ చిత్రం ‘దబాంగ్ 2’కూడా హిట్టయింది . ఈ రెండు చిత్రాల్లో సల్మాన్ , సోనాక్షి జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా తెరకెక్కబోయే ‘దబాంగ్ 3’ లో కూడా మళ్ళీ వీరిద్దరు కలిసి నటించనున్నారు.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ దబాంగ్ 3ఈఏడాది చివర్లో ప్రారభం కానుంది. ప్రభుదేవా ఈచిత్రాన్ని తెరక్కించనున్నారు. ఈ సినిమాకోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఆమె అన్నారు.
ఇక ఈ చిత్రం ఒక పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథ తో తెరకెక్కనుందట. ఈ చిత్రం యొక్క షూటింగ్ మొత్తం దాదాపు ఘజియాబాద్ లో జరుగనుందని సమాచారం. ఇక ఈచిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈచిత్రంతో ఆయన బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన వివరాలను ప్రకటించనున్నారు.


