‘దేవదాస్’ లు రెడీ అవుతున్నారు !

‘దేవదాస్’ లు రెడీ అవుతున్నారు !

Published on Aug 23, 2018 11:31 AM IST

devadas

అగ్ర హీరో నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఇటీవల మొదలైన ఈ చిత్రం యొక్క బ్యాంకాక్ షెడ్యూల్ ఈరోజుతో పూర్తయ్యింది. దాంతో సినిమా చిత్రీకరణ కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్లే. ఇంకో సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. చిత్ర యూనిట్ ఇండియా కు తిరిగొచ్చాక ఈ సాంగ్ చిత్రీకరణను మొదలు పెట్టనున్నారు.

రష్మిక , ఆకాంక్ష సింగ్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రంలో దేవ్ పాత్రలో రౌడీ గా నాగ్ నటిస్తుండగా దాస్ పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకులముందుకు రానుంది.

తాజా వార్తలు