కత్తి హిందీ రీమేక్ కోసం ఇద్దరు హీరోలు !

కత్తి హిందీ రీమేక్ కోసం ఇద్దరు హీరోలు !

Published on Aug 24, 2018 10:17 AM IST

akshay17

ఇళయదళపతి విజయ్ నటించిన ‘కత్తి’ తమిళ నాట ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మంచి సోషల్ కాజ్ తో మురుగదాస్ తెరకెక్కించిన ఈచిత్రం తెలుగులో చిరంజీవి150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ గా రీమేక్ అయ్యి ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈచిత్రం హిందీ లో రీమేక్ కానుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ఇక ఈ రీమేక్ లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేదా యువ హీరో రణ్వీర్ సింగ్ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇంతకుముందు భన్సాలీ రీమేక్ చేసిన సౌత్ చిత్రాలు ‘విక్రమార్కుడు, రమణ’ సినిమాల్లో అక్షయ్ కుమార్ నటించారు. ఈ చిత్రాలు అక్కడ ‘రౌడీ రాథోర్, గబ్బర్’ గా రీమేక్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ కత్తి రీమేక్ కోసం కూడా అక్షయ్ కుమార్ పేరు ఎక్కువగా వినబడుతుంది. ఇక భన్సాలీ మొదటగా ఈ చిత్ర కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తరువాతే ఈసినిమాలో నటించే నటినటులను ఎంపిక చేయనున్నారు.

తాజా వార్తలు