ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో మరియు అమరావతిలో చలన చిత్ర నిర్మాణానికి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ చిత్ర నిర్మాతలు వివిధ రకాలుగా వారి ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం హీరో రామ్ చరణ్ ఓ ఫిల్మ్ స్టూడియోని కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.
వైజాగ్ బీచ్ రోడ్ ప్రాతంలో ఫిల్మ్ స్టూడియోని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రామ్ చరణ్ ఉన్నాడట. అయితే ఈ వార్త కేవలం ఊహాగానమా లేక నిజామా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 12వ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఆయన హీరోగానే కాకుండా కొణిదల ప్రొడక్షన్స్ పై భారీ బడ్జెట్ తో ‘సైరా’ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


