క్రియేటివ్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న2.0 చిత్ర టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదలకానుంది ఈ టీజర్. ఇక దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది.
సూపర్ స్టార్ రజినీ కాంత్ , అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నారు. సుమారు 500కోట్ల బుడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా లైకా ప్రొడక్షన్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. భారీ అంచనాల మధ్య నవంబర్ 29న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.


