తమిళ హీరో విశాల్ , కీర్తి సురేష్ జంటగా లింగు సామి తెరకెక్కిస్తున్న చిత్రం సందకోడి 2. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సంధర్బంగా దర్శకుడు లింగు సామి ఈ చిత్రానికి పనిచేసిన స్టాఫ్ అందరికి గోల్డ్ కాయిన్స్ ను కానుకగా ఇచ్చారు. ఇక దాంతో పాటు ఆయన కేరళ వరద బాధితుల కోసం 2లక్షల రూపాయలను విరాళం గా ఇచ్చారు.
ఇక ఇంతకుముందు ఇదే చిత్రానికి కీర్తి సురేష్ తన పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ చేశాక స్టాఫ్ అందరికి గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. సందకోడి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం తెలుగులో పందెం కోడి 2 పేరుతో విడుదలకానుంది. ఈచిత్రం అక్టోబర్ 18న విజయదశమి కానుకగా రెండు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.


