బిన్నీ మిల్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ సినిమా !

బిన్నీ మిల్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సూపర్ స్టార్ సినిమా !

Published on Aug 25, 2018 10:34 AM IST

rajini3

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నై లోని బిన్నీ మిల్స్ లో జరుగుతుంది. ఇంతకుముందు ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ను డార్జిలింగ్ లో రెండవ షెడ్యూల్ ను డెహ్రాడూన్లో పూర్తి చేశారు.

‘పిజ్జా, జిగర్ తాండ్ర’ ఫెమ్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో స్టార్ నటి నటులు సిమ్రాన్ , నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

తాజా వార్తలు