మరో సౌత్ సినిమా బాలీవుడ్ కు వెళ్లనుంది !

మరో సౌత్ సినిమా బాలీవుడ్ కు వెళ్లనుంది !

Published on Aug 25, 2018 11:00 AM IST

gg

సౌత్ లో సూపర్ హిట్టయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేయడం ఈ మధ్యన ఎక్కువగా జరుగుతుంది. సౌత్ సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఇప్పుడు మలయాళం లో సూపర్ హిట్ సాధించిన ‘బెంగుళూరు డేస్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈచిత్రంలో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించనున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ఆయనే తన సొంత ప్రొడక్షన్స్ లో నిర్మించాలనుకుంటున్నారని సమాచారం.

ఇక 2014లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం 8కోట్ల తో తెరకెక్కి 45కోట్ల వసూళ్లను సాధించిరికార్డు సృష్టించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ, నిత్య మీనన్, నజిరియా నజిమ్, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లోనటించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. ఇక ఈచిత్రం తెలుగులో రీమేక్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

తాజా వార్తలు