నిన్న విడుదలైన ‘నీవెవరో , ఆటగాళ్ళు’ చిత్రాలు మిక్సడ్ టాక్ ను సొంతం చేసుకొని ఓ మోస్తారు కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్నాయి. ఇక ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో మొదటి రోజు నీవెవరో నెట్ రూ. 5,74,280లక్షల వసూళ్లను రాబట్టి పర్వాలేదనిపించిన మరో చిత్రం ఆటగాళ్ళు మాత్రం రూ.1,55,450లక్షల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసి నిరాశ పరిచింది.
ఇక ఈ రెండు చిత్రాలు కలిసి ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ ,రష్మిక ల గీత గోవిందం 10వ రోజు సాధించిన షేర్ ను కూడా కలెక్ట్ చేయలేకపోయాయి. గీత గోవిందం కృష్ణా జిల్లాలో10వ రోజు 10,68,830 లక్షల రూపాయలను రాబట్టి ఇప్పటివరకు రూ.2,52,86,172 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.


