యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సెప్టెంబర్ 13న వినాయకచవితి కానుకగా ఈచిత్రం యొక్క సెకండ్ టీజర్ ను విడుదలచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ టీజర్ బదులు ట్రైలర్ విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తోందట చిత్ర యూనిట్. ఒక వేళా ట్రైలర్ కాకపోయినా చిన్న బిట్ సాంగ్ నైనా విడుదలచేసి అభిమానులకు కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నారట. అంటే వినాయకచవితిరోజు అరవింద సమేత నుండి సప్రైజ్ గ్యారెంటీ.
ఇక త్రివిక్రమ్ ఈ సినిమాను అనుకున్న సమయానికి థియేటర్లలో కి తీసుకువచ్చేందుకు సినిమాకు సంభందించిన అన్ని పనులను త్వరగా పూర్తి చేస్తున్నాడట. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది .


