ప్రభాస్ ను మెప్పించిన పేపర్ బాయ్ !

ప్రభాస్ ను మెప్పించిన పేపర్ బాయ్ !

Published on Aug 27, 2018 10:21 PM IST

prabhas2

సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నూతన దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన చిత్రం ‘పేపర్ బాయ్’. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈచిత్రం ఆగస్టు 31న విడుదలకానుంది. ఈ సంధర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యాక్రమాల్లో బిజీ గా వున్నారు. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను వీక్షించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విజువల్స్ బాగున్నాయని సినిమా పెద్ద హిట్ అవుతుందని చిత్ర టీం కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను వీక్షించి తన అభిప్రాయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈచిత్ర హక్కులను దక్కించుకున్నారు.

తాజా వార్తలు