100డేస్ తో పాటు బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఒకే రోజు జరుపుకోనున్న హీరో !

100డేస్ తో పాటు బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఒకే రోజు జరుపుకోనున్న హీరో !

Published on Aug 28, 2018 2:19 AM IST

Vishal1

విశాల్ , సమంత జంటగా తమిళ భాషలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుంబు తిరై’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం సూపర్ హిట్ ను సాధించి విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇటీవల ఈచిత్రం 100 డేస్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ ను మరియు విశాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఒకే రోజు జరుగనున్నాయి. ఈనెల 29 న విశాల్ పుట్టినరోజు కావడంతో ఈరెండు వేడుకలను ఆ రోజునే జరుపనున్నారు.

చెన్నై లో గ్రాండ్ గా ఈవేడుకలు జరుగనున్నాయి. ఇక వీటితో పాటు అదే రోజు విశాల్ నటించిన ‘పందెకోడి 2’ టీజర్ కూడా విడుదలకానుంది. మొత్తానికి విశాల్ ఒకే రోజు అభిమానులకు భారీ సప్రైజ్ నే ఇవ్వనున్నాడు.

తాజా వార్తలు