రాయలసీమలో భారతీయుడు 2 !

రాయలసీమలో భారతీయుడు 2 !

Published on Aug 28, 2018 10:40 AM IST

Shankar

తమిళ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌, కమల్‌ హాసన్‌ ల కలయికలో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కాగా దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే రెండు రోజుల క్రితం, దర్శకుడు శంకర్ మరియు సినిమాటోగ్రాఫర్ రవి వర్మ హెలికాప్టర్ లో వెళ్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ స్టార్ డైరెక్టర్ – సినిమాటోగ్రాఫర్ కడపలోని ఓ గ్రామాన్ని సందర్శించారు. భారతీయుడు సీక్వెల్‌ షూట్ చెయ్యడం కోసం అక్కడ కొన్ని లొకేషన్స్ ను చూశారు. ఆ లొకేషన్ లోనే ఓ గ్రాండ్ సెట్ ని నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్ముస్తోంది.

తాజా వార్తలు