
టాలీవుడ్ లో ఉన్న అతికొద్దిమంది మల్టీటాలెంటడ్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో చెప్పుకోవాల్సిన పేరు అవసరాల శ్రీనివాస్. ఓ కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టి నటుడిగా, హీరోగా ఓ దర్శకుడిగా తెలుగు తెర పై తనదైన ముద్రని వేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పట్లో అవసరాల శ్రీనివాస్ సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.
కాగా తాజా సమాచారం ప్రకారం అవసరాల తన తర్వాత సినిమా కోసం హీరో నిఖిల్ తో చర్చలు జరిపారట. వీరి కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ ముద్రతో బిజీగా ఉన్నాడు. ముద్ర చిత్రం పూర్తయ్యాక అవసరాలతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట నిఖిల్. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

