ట్రైలర్ తో సందడి చేయనున్న శైలజారెడ్డి అల్లుడు !

ట్రైలర్ తో సందడి చేయనున్న శైలజారెడ్డి అల్లుడు !

Published on Aug 28, 2018 10:59 PM IST

sailajareddy alludu

సస్పెన్స్ కు తెరదించుతూ ‘శైలజారెడ్డి అల్లుడు’ విడుదల తేదీని అధికారికంగా కొద్దీ సేపటి క్రితం ప్రకటించారు. ఈ చిత్రం వినాయకచవితి రోజు థియేటర్లలో సందడి చేయనుంది. ఇక రేపు నాగార్జున బర్త్ డే సంధర్భంగా ఈచిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నామని చిత్ర దర్శకుడు మారుతీ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

ఇక ఈ చిత్రం సమంత ‘యు టర్న్’ అలాగే సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాలతో సెప్టెంబర్ 13న బాక్సాఫిస్ వద్ద పోటీ పడనుంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు