రేపు 4 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్తానంలో హరికృష్ణ అంత్యక్రియలు !

రేపు 4 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్తానంలో హరికృష్ణ అంత్యక్రియలు !

Published on Aug 29, 2018 5:31 PM IST

hari krishna celeb1

ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణగారి మరణంతో సినీ రాజకీయ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యాయి. నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికే హరికృష్ణగారి భౌతికకాయానికి ఇరు రాష్ట్రాల సీఎమ్ లు తమ నివాళ్ళర్పించి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

కాగా హరికృష్ణగారిని చివరిచూపు చూడటం కోసం నందమూరి అభిమానులు ఆయన ఇంటికి తరలివచ్చారు. రాలేకపోయిన పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు.

అయితే రేపు మధ్యాహ్నం 2.30కి హరికృష్ణ గారి ఇంటి నుంచి అంతిమయాత్ర, ఆ తర్వాత 4 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

తాజా వార్తలు