
దివంగత నేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర తో ‘ఆనందో బ్రహ్మ’ ఫెమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ సాంగ్ ‘సమర శంఖం’ లిరికల్ వీడియో ను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ గేయాన్ని కీరవాణి తనయుడు కాల బైరవ ఆలపించారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రంలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈచిత్రాన్ని 70ఎమ్ఎమ్ పతాకం ఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

