సమంత అక్కినేని ప్రధాన పాత్రలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘యు టర్న్’. కన్నడలో విజయం సాధించిన యు టర్న్ చిత్రానికి రీమేక్ గా వస్తుంది ఈచిత్రం. ఇక ఈసినిమా విడుదలతేది దగ్గర పడుతుండంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొటుంది చిత్ర టీం.
ఇక ఈ చిత్రం తెలుగులో నిర్మాతలకు విడుదలకు ముందే లాభాలను తీసుకొచ్చింది. దాదాపు 5కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క రెండు తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను సురేష్ రెడ్డి 6కోట్లకు దక్కించుకున్నారు. ఇక సమంత కు వున్నఇమేజ్ దృష్ట్యా శాటిలైట్ హక్కుల రూపంలో కూడా ఈచిత్రానికి మంచి ప్రాఫిట్ రానుంది.
ఇక ఈ ఏడాది సమంత నటించిన చిత్రాలు వరుసగా బ్లాక్ బ్లాస్టర్ విజయాలను సాధించాయి. ఆరూపంలో కూడా ఈ చిత్రానికి కలిసి రానుంది. పవన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, భూమిక ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగు,తమిళ భాషల్లో ఈచిత్రం వినాయకచవితి రోజు సెప్టెంబర్ 13న విడుదల కానుంది.


