కేరళకు రెహమాన్ సాయం !

కేరళకు రెహమాన్ సాయం !

Published on Sep 3, 2018 12:02 PM IST

rahaman

ఇటీవల వర్షాలతో ఘోరంగా దెబ్బతిన్న కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే ప్రముకులనుండి కేరళకు ఇంకా విరాళాలు అందుతూనే వున్నాయి. దాంట్లో భాగంగా ప్రముఖ సంగీతం దర్శకుడు ఎ ఆర్ రహెమాన్ తన బృందం తో కలిసి కేరళకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయిలను విరాళం గా ఇచ్చారు. ఇక నిన్న రహెమాన్ తన బృందం తో కలిసి అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని కేరళకు విరాళం గా ఇచ్చారు.

అలాగే కేరళ వరదబాధితుల కోసం రెహమాన్ పాట పాడి ఆ రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పారు. ఇక ఇటీవల వరదల వల్ల నష్టపోయిన కేరళకు చాలా మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేశారు. అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్, విజయ్, చిరంజీవి , నాగార్జున , ప్రభాస్, విజయ్ దేవరకొండ తదితరులు విరాళాలను ప్రకటించారు.

తాజా వార్తలు