బడా సంస్థలో గూఢచారి దర్శకుడు !

బడా సంస్థలో గూఢచారి దర్శకుడు !

Published on Sep 4, 2018 8:04 PM IST

Shashi Kiran

అడివిశేష్ హీరోగా నూతన దర్శకుడు శశికిరణ్ టిక్క తెరకెక్కించిన చిత్రం ‘గూఢచారి’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రం తరువాత శశి కిరణ్ తన తదుపరి చిత్రాన్ని పెద్ద బ్యానేర్ లో చేయనున్నాడు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మించనుంది. శశి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట నిర్మాతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన వివరాలను ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఈ బ్యానేర్ లో తెరకెక్కిన ‘శైలజారెడ్డి అల్లుడు’ విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈసినిమాతో పాటు ‘మళ్ళిరావా’ డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో నాని నటించనున్న ‘జెర్సీ చిత్రాన్ని’ కూడా ఈ సంస్థే నిర్మిస్తుంది.

తాజా వార్తలు