ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ చిత్రంలోని పాట విడుదలైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ ని చూస్తుంటే పల్లెటూరి వాతావరణంలోని బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చుట్టూ సినిమా అంతా ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రం ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తోట వి రమణ సినిమాటోగ్రఫీ అందించగా సాబూ వర్గీస్ సంగీతాన్ని సమకూర్చారు. ఎస్ బీ ఉద్ధవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


