సాహోలో జాయిన్ అయిన ప్రముఖ కమీడియన్ !

సాహోలో జాయిన్ అయిన ప్రముఖ కమీడియన్ !

Published on Sep 5, 2018 1:15 PM IST

vennala

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న’సాహో’ చిత్ర షూటింగ్ గత కొద్దీ రోజులనుండి హైదరాబాద్లోని రామోజీ ఫిలింసిటీ లో జరుగుతుంది. తాజాగా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్. ప్రస్తుతం ప్రభాస్, మురళి శర్మ , వెన్నెల కిశోర్ ల ఫై కొన్నిముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ లాంగ్ షెడ్యూల్ ఈనెల చివరి వారంలో ముగియనుంది.

యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో జాకీ ష్రాఫ్, నిల్ నితిన్ ముకేశ్ ప్రతినాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. శంకర్ -ఎహసాన్ – లాయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలకానుంది.

తాజా వార్తలు