‘టచ్ చేసి చూడు’ సినిమా తరువాత మాస్ రాజా నటించిన చిత్రం ‘నేల టికెట్టు’,’సోగ్గాడే చిన్నినాయనా’ ఫెమ్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈచిత్రం ఇటీవల విడుదలై రవితేజ కెరీర్లో నే అత్యంత డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఎస్ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై రవి తాళ్లూరి నిర్మించిన ఈచిత్రం భారీ నష్టాలను మిగిల్చింది.
ఇక ఇప్పుడు రవితేజ మరో సారి ఇదే ప్రొడక్షన్స్ లో సినిమా చేయనున్నాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫెమ్ వి ఐ ఆనంద్ తెరకెక్కించనున్న చిత్రంలో రవితేజ సినిమా చేయనున్నాడని తెల్సిందే. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఈచిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్ లో నటించనున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని పూర్తి చేసి వి ఐ ఆనంద్ చిత్రంలో నటించనున్నాడు. నిజానికి అమర్ అక్బర్ తరువాత రవి తేజ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరి రీమేక్ లో నటించాల్సి వుంది ఎందుకో ఈచిత్రాన్ని హోల్డ్ లో పెట్టారు.


