ఈరోజు విడుదలకానున్న సామి ట్రైలర్ !

ఈరోజు విడుదలకానున్న సామి ట్రైలర్ !

Published on Sep 8, 2018 10:38 AM IST

swami

హరి దర్శకత్వంలో చియాన్ విక్రమ్, కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కిన చిత్రం ‘సామీ స్క్వేర్’. గతంలో విక్రమ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘సామి’కి సీక్వెల్ గా వస్తుంది ఈచిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక ఈచిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ గా వున్నారు చిత్ర యూనిట్. ఔరా సినిమాస్ ,పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం ఫై కావ్య వేణుగోపాల్ , బెల్లం రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈచిత్రాన్నితెలుగులో ‘సామి’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు.

ఈచిత్రం యొక్క తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఈ రోజు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో సాయంత్రం 7గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పుటికే విడుదలైన తమిళ వెర్షన్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబూ తమిన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3వ వారంలో విడుదల కానుంది.

తాజా వార్తలు