యాక్షన్ హీరో సరసన మిల్కీ బ్యూటీ !

యాక్షన్ హీరో సరసన మిల్కీ బ్యూటీ !

Published on Sep 10, 2018 7:38 PM IST

tamanna vishal
దర్శకుడు సుందర్‌.సి. దర్శకత్వంలో యాక్షన్ హీరో విశాల్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కటానికి రంగం సిద్ధం అవుతుంది. కాగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మదగజరాజ’, ‘ఆంబల’ రెండు చిత్రాలు వచ్చాయి. అయితే అందులో ‘మదగజరాజ’ చిత్రం కొన్ని వివాదాస్పద కారణాల రిత్యా ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇక రెండో చిత్రం ‘ఆంబల’ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాగా ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ సినిమా చెయ్యబోతుండటం విశేషం.

అయితే కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమాలో విశాల్‌ సరసన జోడిగా తమన్నా నటించబోతుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘కత్తిసండై’ అనే చిత్రంలో కలిసి నటించారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత విశాల్ తమన్నా జోడి కట్టనున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు. ఈ చిత్రంతో కోలీవుడ్ లో మళ్లీ బిజీ అవుతుందేమో చూడాలి.

తాజా వార్తలు