అఖిల్ 3 ఫస్ట్ లుక్ టీజర్ ఫై చరణ్ కామెంట్ !

అఖిల్ 3 ఫస్ట్ లుక్ టీజర్ ఫై చరణ్ కామెంట్ !

Published on Sep 21, 2018 10:35 PM IST

Akhil ramcharen

యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ టీజర్ ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. టీజర్ చాల కొత్తగా ఉందని అఖిల్ , వెంకీ అట్లూరి ,తమన్ కాంబినేషన్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని చిత్ర టీం కు అల్ ది బెస్ట్ అంటూ తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అఖిల్ ప్లే బాయ్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఎస్వి స సి పతాకం ఫై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు